నంద్యాల అర్బన్: ఎల్ హెచ్ ఎం ఎస్ యాప్ తో మీ ఇంటికి రక్షణ :నంద్యాల ఎస్పీ మంద జావలి ఆల్ ఫోన్స్
Nandyal Urban, Nandyal | May 14, 2026
నంద్యాలలో పోలీసుల వినూత్న ప్రయత్నం. దొంగతనాలు అరికట్టేందుకు ఎల్ హెచ్ ఎం ఎస్ ( లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అని వినూత్న కార్యక్రమానికి శుక్రవారం నుండి నంద్యాల సబ్ డివిజన్లో శ్రీకారం చుడుతున్నట్లు నంద్యాల అడిషనల్ ఎస్పీ మంద జావలి ఆల్ ఫోన్స్ గురువారం మీడియా తెలిపారు. ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఊళ్ళోకి వెళ్లే సమయంలో దొంగతనాలకు అవకాశం లేకుండా ఈ వ్యవస్థ పని చేస్తుందని వివరించారు