నంద్యాల అర్బన్: నంద్యాల ఏఎస్పీ మంద జావలి బదిలీ
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
నంద్యాల జిల్లా ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ బదిలీ అయ్యారు. పోలవరం ఓఎస్టీ(అడ్మిన్) గా బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మందా జావళి స్థానంలో జంగారెడ్డి గూడెంలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ సుస్మితను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 6 మంది ఐపీఎస్ స్థానాల్లో మార్పులు జరిగాయి.