ఆళ్లగడ్డ: కొండంపల్లి గ్రామంలో 300 వరిగడ్డి చుట్టలు దగ్ధం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కొండం పల్లి లో 300 చుట్టలు దగ్ధమయ్యాయి, కళ్ళల్లో ఉన్న గడ్డి చుట్టాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు అంబారపు లక్ష్మీనరసింహ తెలిపారు, గాలి వేగంగా వేస్తుండడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదన్నారు, ఆళ్లగడ్డ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు, దీంతో రైతుకు దాదాపు 60 వేల వరకు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు