కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన ఏఐటియుసి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ.... మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని అధికారులకు విన్నవించినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. ఈనెల 18 లోపు పెండింగ్ వేతనాలు చెల్లించుకుంటే 19వ తేదీ నుండి కార్మికులు సమ్మె బాట పడతారని ఆయన హెచ్చరించారు.