డోన్: బేతంచెర్ల లో అన్నదమ్ములపై దాడి చేసిన వారిపై కేసు నమోదు
Dhone, Nandyal | Jun 5, 2026 బేతంచెర్లలోని బైటి పేట కాలనీకి చెందిన అన్నదమ్ములు ఉప్పు నాగభూషణం, సుధాకర్పై సమీప బంధువులు పురుషోత్తం, మదన గోపాల్, వెంకటసుబ్బయ్య, మధు కుమార్, రవి, రమేశ్, బాబు గొడవ పెట్టుకొని దాడిచేసి గాయపరిచారని ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. బాధితుడు నాగభూషణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన గురువారం తెలిపారు.