ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 6, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే కొన్ని పరిష్కరించారు. మరి కొన్నిటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.