అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కురుబ సోదర సోదరీమణులు తమ తమ కుటుంబ సభ్యులతో కలసి తమ ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస జయంతి వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్త కనకదాస ఉత్సవ విగ్రహానికి గురువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కనకదాస జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం నుండి గ్రామోత్సవ కార్యక్రమాన్ని రాత్రి 8.30 వరకు ఆచార సాంప్రదాయాలైన డోలు వాయిద్యాల డప్పుల మధ్య నిర్వహించారు. జయంతి వేడుక సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.