IPL 2025లో RCB గెలవడంతో వరంగల్ పోచం మైదాన్ జంక్షన్‌లో సంబరాలు చేసుకున్న ఆర్సీబీ అభిమానులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ 2025 ఫైనల్లో గెలవడంతో వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ మంగళవారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పోచమ్మ మైదానంలోని రాణి రుద్రమదేవి జంక్షన్ వద్ద రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ ఆర్సిబి జెర్సీలను చేతొని సంబరాలను చేసుకున్నారు ఆర్ సి బి ఫ్యాన్స్. పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మి కూడడంతో పోలీసులు అక్కడ చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.