మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన MLA మురళీ నాయక్
మహబూబాబాద్ లో జులై 8న జరిగే కాంగ్రెస్ పార్టీ మహాసభను విజయవంతం చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ పిలుపునిచ్చారు. భారత మాజీ ఉప ప్రధాని గౌరవనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని వారి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలు లేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 8న మహబూబాబాద్ లో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొనే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .