ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో అనాధ మహిళపై అత్యాచారం మూడు నెలల గర్భిణి
సమాజాన్ని కలచి వేసే ఘటన ఆళ్లగడ్డలో వెలుగు చూసింది మతిస్థిమితం లేని యువతి గర్భం దాల్చడంతో ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆళ్లగడ్డ పట్టణంలో సంచరిస్తూ ఎవరైనా ఇచ్చిన ఆహారం తింటూ రాత్రి ఎప్పుడో ఒకచోట పడుకొని యువతి బస్టాండ్ లో అనారోగ్యంగా కనిపించింది, స్థానికుల సమాచారంతో సిడిపిఓ తేజేశ్వరి ఆమెను నంద్యాల వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు, వైద్య పరీక్షలలో ఆమె మూడు నెలల గర్భిణీ అని తేలింది