తాడిపత్రి: వెంగన్నపల్లిలో వైసీపీ కార్యకర్తపై దాడి, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం, వెంగన్నపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు కట్టలతో దాడి చేశారు. ఈ దాడిలో వైసిపి కార్యకర్తలు లక్ష్మీనాథరెడ్డి వెంకట లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడి అనంతపురంలోను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను చట్నీ తాడిపత్రి వైసిపి ఇన్చార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు పార్టీ అండగా ఉంటుందని అధైరపడకూడదని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సామాన్యులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.