సంతనూతలపాడు: చీమకుర్తిలో వైభవంగా శ్రీ మహబూబ్ సుభాని గంధ మహోత్సవం, కార్యక్రమానికి హాజరై గుర్రంపై ఊరేగిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
చీమకుర్తి పట్టణంలో శ్రీ మహబూబ్ సుభాని గంధమహోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు శ్రీ మహబూబ్ సుభాని గంధమహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటుచేసిన గుర్రంపై కొద్దిసేపు ఊరేగి, కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహపరిచారు.