నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
Nandyal Urban, Nandyal | Apr 26, 2026
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు దేవస్థానం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచారి తెలిపారు. స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. స్వామివారి కాలజ్ఞాన సందేశాలు ఈ కాలంలోనూ ప్రజలకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు.