బనగానపల్లె: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం సహాయ కార్యదర్శిగా కొలిమిగునకు చెందిన మనోహర్ రెడ్డి నియామకం
వైసీపీ రాష్ట్ర రైతు విభాగం సహాయ కార్య దర్శిగా కొలిమిగుండ్ల మండలానికి చెందిన మనోహర్ రెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పజెప్పిన అధినేత జగన్మోహన్ రెడ్డికి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని కలిసి, శాలువా కప్పి సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.