350 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు: గూడెం కొత్తవీధి మండల పశువైద్యాధికారి డాక్టర్ లోకుల రమేష్
గూడెం కొత్తవీధి మండలంలో అక్టోబర్ నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి డాక్టర్ లోకుల రమేష్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గూడెం కొత్తవీధి మండలంలోని లింగవరం, పెద్దవలస, మంగళపాలెం గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 350 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు. ఆయా పంచాయతీల సర్పంచ్లు వంశీకృష్ణ, బుజ్జిబాబు తదితర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మందులు పంపిణీ చేశామన్నారు.