రాజేంద్రనగర్: హిమాయత్ నగర్ లో శాంతి యువజన సంఘం ఎన్నికలు
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ నేడు శాంతి యువజన సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కుమ్మరి విట్టల్, ఉపాధ్యక్షుడిగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా కాళిదాస్ చారి విజయం సాధించారు. గ్రామ యువత అభివృద్ధి, సామాజికసేవల దిశగా కొత్త కమిటీ కృషి చేస్తుందని సభ్యులు తెలిపారు. గెలుపొందిన వారిని గ్రామస్థులు, యువకులు శుభాకాంక్షలు తెలిపారు.