వేములవాడ: శరవేగంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు..హర్షం వ్యక్తం చేస్తున్న రాజన్న భక్తులు, స్థానిక ప్రజలు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి సన్నిధిలో అభివృద్ధి పనులు మంగళవారం శరవేగంగా ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న భక్తులతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆలయంలోని కళా భవన్,ఈవో ఆఫీస్ సముదాయాలను కూల్చివేస్తున్నారు.ఇప్పటికే భీమన్న గుడిలో భక్తులకు ప్రత్యామ్నాయ దర్శనం నేపథ్యంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు.