అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా లక్ష్మణ్ పల్లి లో వృద్ధురాలి పైకి దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం వృద్ధురాలికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని సెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో వృద్ధురాలి పైకి ద్విచక్ర వాహనం దూసుకుని రావడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో వృద్ధురాలిని శుక్రవారం రాత్రి అనంతపురం ప్రభుత్వ సర్వేజనా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.