భిక్కనూర్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష, రూ.1000 జరిమానా : ఎస్సై ఆంజనేయులు
భిక్కనూరు : మద్యం తాగి వాహనం నడిపిన ఒక వ్యక్తికి రెండు రోజుల పాటు జైలు శిక్ష పడిందని భిక్కనూరు మండలం ఎస్సై ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం 2 సమయంలో తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన పోచమ్మల స్వామి మద్యం తాగి వాహనం నడిపినట్లు చెప్పారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ ఆయనకు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు వివరించారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టారిత చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.