డోన్ మండలంలో కార్ బోల్తా, మహిళలకు గాయాలు
Dhone, Nandyal | Jun 1, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపల్లి జియో పెట్రోల్ బంకు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు మగ, ఒకరు మహిళ ఉన్నారు. ప్రమాదంలో మహిళకు కాలు విరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.