త్రిపురారం: మండలంలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ
నల్గొండ జిల్లా, త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి, త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం సాయంత్రం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని, మందల కొరత లేకుండా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి తెప్పించుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.