ఒంగోలు అర్బన్: వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం జరుగుతున్న తీరును పరిశీలించిన రాష్ట్ర మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Jul 2, 2026
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. గురువారం ఒంగోలు (పేర్నమిట్ట) పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రక్రియను స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేలంలో 'నో బిడ్' (No Bid) సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ చురుగ్గా వేలంలో పాల్గొని రైతులకు న్యాయం చేయాలన్నారు .కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, పొగాకు పండించే రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు