పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ ఆలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి నాసరయ్య మృతి చెందాడు. గుండెపోటు రావడంతో నాసరయ్యను నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గం మధ్యలో నాసరయ్య మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కోటప్పకొండ ఆలయం కమిటీలోని ఓ అధికారి వేధింపుల వల్లే ఒత్తిడి తట్టుకోలేక నాసరయ్య గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు నాసరయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు.