నంద్యాల అర్బన్: ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలని మార్కెటింగ్ చేయాలి : నంద్యాల ఏవో ప్రసాదరావు
Nandyal Urban, Nandyal | May 30, 2026
నంద్యాల మండల పరిధిలోని విత్తన శుద్ధి కేంద్రాలను వ్యవసాయ అధికారి ప్రసాదరావు శనివారం తనిఖీ చేశారు. ప్రాసెసింగ్ రికార్డులు, బ్రీడర్ బిల్లులు, రైతులకు ఇచ్చే రసీదులు, విత్తన నిల్వలను పరిశీలించారు. విత్తన నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నమూనాలను సేకరించి, ప్రయోగశాలకు పంపారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే మార్కెటింగ్ చేయాలని వారు ఆదేశించారు.