నంద్యాల అర్బన్: నంద్యాల రైలు ప్రయాణికులకు శుభవార్త గుంటూరు-తిరుపతి రైలు అరుణాచలం వరకు పొడిగింపు
Nandyal Urban, Nandyal | May 9, 2026
నంద్యాల మీదుగా ప్రయాణిస్తున్న గుంటూరు-తిరుపతి రైలు(17261/17262) అరుణాచలం వరకు ప్రయాణించనుంది. ఈ రైలు వెల్లూరు, అరుణాచలం, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీంతో మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అయింది. త్వరలో ఈ రైలు పొడిగింపు కార్యరూపం దాల్చనుంది.