ఒంగోలు అర్బన్: పదిమంది వెట్టిచాకిరి బాధితులకు విముక్తి కల్పించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 29, 2026
దాదాపు 11 ఏళ్ల నుంచి సుబాబుల్ కర్ర నరికే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న 10 మందికి కలెక్టర్ రాజాబాబు విడుదల కల్పించారు. శుక్రవారం కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో నిర్వహించిన ' పల్లె నిద్ర ' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి రిలీఫ్ సర్టిఫికెట్లు అందించారు. వీరికి సంబంధిన వివరాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన 3 గిరిజన కుటుంబాలు తాళ్లూరు మండలం వెలిగూరిపాడు గ్రామానికి చెందిన సుబాబులు తోట కలిగిన శ్రీనివాసులు రెడ్డి అనే రైతు వద్ద వెట్టి చారికీ చేస్తున్నారు. వారికి విముక్తి కల్పించారు