కుముందానిపేటలో అగ్నిప్రమాదం, రెండు లక్షల ఆస్తి నష్టం
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం మంగళాపురం శివారు కుముందానిపేటలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యల్లపు సూర్య కాంతం తన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించగా మంటలు చెలరేగి ఇల్లంతా కాలిపోయింది. దీనివల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఇంట్లోనే విద్యుత్ వైరింగ్ కాలిపోయింది. స్థానికులు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత మహిళ సూర్యకాంతం తెలిపింది.