నారాయణపేట్: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబివిపి ఆధ్వర్యంలో ధర్నా
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని సోమవారం 12 గంటల సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న 8300 రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.