బనగానపల్లె: బనగానపల్లెలో పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విపరీతంగా పెరిగిపోతున్న భూమి మందుల ధరలు తగ్గించాలని నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు వ్యాపారాన్ని అరికట్టాలని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బనగానపల్లె పెట్రోల్ బంక్ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధరలు తగ్గే వరకు పోరాడతామని పేర్కొన్నారు.