నకిరేకల్: ఆపదలో ఉన్న వారికి అండగా సిఎం సహయనిధి:నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నియెజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) కింద మంజూరైన 246 లబ్ధిదారులకు 86 లక్షలు విలువైన చెక్కులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయ అనేది ఉపయోగపడుతుందన్నారు .ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.