డోన్: బేతంచెర్ల లో ఆకట్టుకున్న చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు
Dhone, Nandyal | Apr 4, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమంలో శనివారం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భారతదేశ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన ఎంతో అవసరమని ఎంఈవోలు సోమశేకర్, సీటీ అబ్రహం అన్నారు. కూచిపూడి నృత్యం, తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.