నాగలాపురం: తురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయానికి ఫోటేత్తిన భక్తులు
నాగలాపురం మండలం సురుటపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో తమిళ కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలోని రాగి చెట్టు వద్ద మహిళలు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు కార్తికేసన్ రుద్ర హోమం, రుద్రాభిషేక పూజలు చేశారు. మహిళలు నేతి దీపాలు వెలిగించి పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈఓ లత కార్యక్రమాలను పర్యవేక్షించారు.