రాప్తాడు: సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ద్వారా జిల్లా ప్రజలకు ఏమి వచ్చింది? పాపంపేటలో ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నాగరాజ్ ప్రశ్నించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో సోమవారం 6:30 గంటల సమయంలో పాపంపేట వద్ద ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయ్ సభలో పాల్గొని జిల్లా ప్రజలకు ఏమి వరాలు ఇచ్చారన్నారు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లా ప్రజలకు ఏమి వరాలు ఇచ్చారు ఎంత లాభం వచ్చిందో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు సూపర్ సిక్స్ సభపై పలు విమర్శలు చేశారు.