జహీరాబాద్: ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు అధిక లాభం, ఎమ్మెల్యే మాణిక్ రావు
ఆయిల్ ఫామ్ సాగుతో రైతు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబా నగర్ లో శనివారం సాయంత్రం రైతు సత్యం ముదిరాజ్ పొలంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు ద్వారా 30 నుండి 40 సంవత్సరాలు వరకు ఆదాయం పొందవచ్చు అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని రైతులు ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.