సుండుపల్లె మండలం రాచంవాండ్ల పల్లెకు చెందిన జర్నలిస్టు వల్లెపు శ్రీరాములుపై వైసీపీ నేత ఆనంద్ రెడ్డి అనుచరులు శుక్రవారం దాడి చేసినట్లు సమాచారం. అనుంపల్లి అటవీ ప్రాంతంలో బైకును అడ్డగించి రాడ్లు, కర్రలతో కొట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. భూ వివాదంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరగిందని వాపోయాడు. ఈ ఘటనపై రాయచోటి ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.