నందికోట్కూరు: పాత మాడుగుల గ్రామంలో పాముకాటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాముకాటుకు గురై ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన గురువారం పాత మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెలితే మండలంలోని ఎర్రమఠం గ్రామపంచాయతీ పరిధిలోని మజారా గ్రామమైన పాతమాడుగుల గ్రామానికి చెందిన రామచంద్రుడు. శివపార్వతి ల కొడుకు రాంచరణ్ (13) ముసలిమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8 వ తరగతి చదువుతున్నాడు,అతని పెదనాన్న కూతురు పెళ్ళి ముహుర్తం ఉంటే ఇంటివద్ద ఉన్నాడు. మధ్యహ్నం ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ఇంట్లో పొదిగిన కోడీ గట్టి గట్టిగా అరవడం గమనించాడు,మంచం పై నుంచే కోడిని నివారించేందుకు చేయి ఊపాడు,అప్పటికే అక్కడ ఉన్న పాము రామ్ చరణ