భామిని మండలంలోని వడ్డంగి ఎత్తిపోతలు పథకాన్ని బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డంగి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకపోవడంతో రైతులు వర్షాధారం పై ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే దాన్ని పూర్తి చేయాలన్నారు. వడ్డంగి ఎత్తిపాతులు ద్వారా 3,300 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.