నంద్యాల అర్బన్: నంద్యాలలో రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవు: మంత్రి ఫరూక్ హెచ్చరిక
Nandyal Urban, Nandyal | May 16, 2026
పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్వచ్ఛత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారితోపాటు మంత్రి పాల్గొన్నారు