కర్నూలు: గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు సమతుల్యతతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది: జాయింట్ కలెక్టర్ నవ్య
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య పేర్కొన్నారు.. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పౌష్టికాహార మాసోత్సవాల పోస్టర్స్ ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ్ మా వేడుకలు జిల్లాలోని 1886 అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా జరుగుతాయన్నారు