నారాయణపేట్: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సాధించిన చంద్రకళ విద్యార్థిని
నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామానికి చెందిన చంద్రకళ అనే విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చదివి 470 మార్కులతో 1200 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు సాధించింది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఎంబిబిఎస్ సీట్ వచ్చినట్లు ఆదివారం ఆరు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నతనం నుండి ఎంబిబిఎస్ సాధించాలనే తపనతో చదివి సీటు సాధించినట్లు తెలిపారు.