పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ మర్రిదారులు కొలువైన సమస్యలు పరిష్కరించాలని వినతి #localissue
పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ మర్రిదాటు పివిటిజి గ్రామంలో సమస్యలు కొలువై ఉన్నాయి. గ్రామానికి రహదారి సదుపాయం లేదు సరి కదా పాఠశాల,అంగన్వాడీ సదుపాయం లేదు. గ్రామస్తులు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇల్లు నిర్మించడానికి అవసరమైన సామగ్రిని తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. పాఠశాల సౌకర్యం లేకపోవడంతో గ్రామానికి చెందిన 20 మంది విద్యార్థులు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మరిదాటు గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.