నందికోట్కూరు: నందికొట్కూరులో ఈనెల 18న అడిషనల్ కోర్టు ప్రారంభం
నందికొట్కూరు పట్టణంలో ఈ నెల 18న అడిషనల్ కోర్టు ప్రారంభం కానున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరభయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అదనపు కోర్టు ఏర్పాటుతో కక్షిదారుల కేసులు త్వరగా పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.