కర్నూలు: కర్నూలు నగర ప్రజలకు సౌకర్యవంతంగా వెండర్ జోన్లు: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు నగర ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నగరపాలక పాలకవర్గం తీసుకున్న తీర్మానానికి అనుగుణంగా వెండర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు నగరపాలక కార్యాలయంలో టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో నగరంలోని 127 ప్రాంతాలను రెడ్, గ్రీన్, అంబర్ జోన్లుగా విభజించిన తీర్మానాన్ని కమిటీ ఆమోదించిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధి వ్యాపారాలు నిషేధంగా, ఇంకొన్ని ప్రాంతాల్లో పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో అనుమతించేలా జోన్ల ఏర్పాటు