ఎన్టీఆర్ నగర్ వాసులకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి : సిపిఎం నేతలు డిమాండ్
11వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ గురువారం జరిగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 35 సంవత్సరాలు నుండి పట్టాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే రకంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలను ఇవ్వాలన్నారు.