గుంతకల్లు: బాకీ డబ్బులు అడిగినందుకు మహిళపై దాడి, గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
నర్సరీలో మొక్కలు కొని బాకీ పడిన రూ. 70000 ఇవ్వాలని అడిగినందుకు మహిళపై నారాయణ దాడి చేసి కొట్టిన ఘటన గుత్తిలో శుక్రవారం చోటుచేసుకుంది.గుత్తికి చెందిన మహాలక్ష్మి తాడిపత్రి రోడ్డులో నర్సరీ నిర్వహిస్తున్నారు. ఓబులాపురం కు చెందిన నారాయణ రూ.70 మొక్కలు కొనుగోలు చేసి తర్వాత ఇస్తానన్నాడు. ఏడాది అయినా ఇవ్వలేదు.మహాలక్ష్మి బాకీ డబ్బులు అడిగింది.దీంతో దాడి చేసి కొట్టాడు. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.