డోన్: డోన్ లో ఖరీఫ్ సాగుకు రైతుల సిద్ధం
Dhone, Nandyal | May 12, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ఆయా గ్రామాల్లో జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగుకు పంట పొలాలను రైతులు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాల్లో గతంలో వేసిన కంది, పత్తి, మొక్కజొన్న, కొర్ర, ఆముదం పంటల కొయ్య లతొలగింపు పనులు చేపట్టి, ట్రాక్టర్లతో దుక్కులు దున్ని పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది కష్టాల నుంచి గట్టెక్కాలని కోటి ఆశలతో రైతులు పంట పొలాలను సాగుకు సిద్ధం చేస్తున్నారు.