డోన్: యోగాతోనే ఆరోగ్యం: డోన్ ప్రభుత్వ అధికారులు
Dhone, Nandyal | Jun 7, 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి యోగా ట్రైనర్ల ఆధ్వర్యంలో ఆదివారం యోగా నిర్వహించారు. వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామ విధానాలను పరిచయం చేస్తూ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా యోగాభ్యాసంలో పాల్గొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని అధికారులు పేర్కొన్నారు.