నంద్యాల అర్బన్: అట్రాసిటీలు కుల వివక్షకు తావు లేకుండా సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి : నంద్యాలలోఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్
Nandyal Urban, Nandyal | Jun 2, 2026
షెడ్యూలు కులాల సంక్షేమ హక్కుల పరిరక్షణ కుల వివక్ష నిర్మూలన ఎస్సీ ఎస్టీ చట్టాల సమర్థ అమలపై అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహార్ అన్నారు ప్రజల సమస్యల పట్ల సానుభూతితో స్పందిస్తూ పెండింగ్లో ఉన్న పిటిషన్ సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు మంగళవారం నంద్యాల కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం పిసిఆర్ యాక్టర్లు తదితర అంశాలపై ఆర్డీవోలు డిఎస్పీలు తాసిల్దారులు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సునీల్ షోరాన్ తదితరులు పాల్గొన్నారు