ఆత్మకూరు: సోమశిలలో సీతారామాలయంలో నేలకొరిగిన ధ్వజస్తంభం
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిలలోని సీతారామాలయంలో తుఫాన్ ప్రభావంతో ధ్వజస్తంభం నేల కూలింది. దశాబ్దాల కాలం క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఈదురుగాలుల బీభత్సానికి నేలకొరగడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈదురు గాలుల దాటికి సోమశిల పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరగడంతో పోలీసులు, అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు సోమశిల జలాశయానికి భారీగా వరద చేరుతున్నాడంతో పెన్నా పరివాహక ప్రాంతాలను ఎస్సై శ్రీనివాసరెడ్డి బుధవారం అప్రమత్తం చేశారు.