ఆళ్లగడ్డ: మహానంది సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద, బైక్ అదుపుతప్పి ఐదుగురికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన బైక్ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు, మహానంది నుంచి తిమ్మాపురం వెళ్తుండగా బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సూచిక స్తంభాన్ని ఢీ కొట్టింది, ఈ ఘటనలో తిమ్మాపురానికి చెందిన గౌతం ప్రభాస్ అనే యువకులతో పాటు మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు, 108 వాహనంలో గాయపడిన బాధితులలో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు